ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు..

– కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీటీసీ కవిత
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం అవరణం వద్ద ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కడగండ్ల కవిత హజరై ఎంపీటీసీ కొలిపాక రాజు,గ్రామ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.మండలంలోని మహిళలందరికి జెడ్పీటీసీ కడగండ్ల కవిత మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సురేశ్,అంగన్వాడీ ఉపాధ్యాయులు,గ్రామ మహిళలు హజరయ్యారు.
Spread the love