– ఎన్‌పిఆర్‌డి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏశాల గంగాధర
నవతెలంగాణ-బోధన్
బడ్జెట్ కేటాయింపులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల పట్ల వివక్షచూపి వారి సంక్షేమానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదని ఎన్‌పిఆర్‌డి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏశాల గంగాధర్ ఆరోపించారు. శుక్రవారం మండలం పెంటాకుర్ద్ గ్రామంలో నిర్వహించిన వికలాం గుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌ను సవరించి 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు ప్రస్థావనలేని కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు వికలాంగులను పట్టించుకోకుండా మోసం చేశారన్నారు. అనంతరం ఎన్‌పిఆర్‌డి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారతకు 2024-25 బడ్జెట్లో 1225.27 కేటాయించిందని గత సంవత్సరంలో బడ్జెట్‌తో పోలిస్తే 0.02. శాతం పెంచింది అన్నారు. వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615.33 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ను ప్రత్యేకంగా వికలాం గులకు కేటాయించి కేంద్రం రూ.3000 పెన్షన్, రాష్ట్రము రూ.6000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఇంటి స్థలాలు, ఇండ్ల నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు కేటాయించాలని, వికలాంగులకు ప్రత్యే కంగా అంత్యోదయ కార్డులు కేటాయించి నెలకు 35కిలోల బియ్యం ఇవ్వాలని, స్వయం ఉపాధి రుణాలు ప్రతి వికలాంగుడికి ఐదు లక్షలు ఇవ్వాలని, తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్‌పిఆర్‌డి జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు ముంజ సాయిలు, ఎల్లయ్య, ఈశ్వర్ పటేల్, గంగారం పటేల్, జయరాం, సాయినాథ్, పల్లికొండ చింటూ, సోనీ, రామచందర్రావు, గంగమణి, లక్ష్మి, హరిప్రియ, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆశలకు నీళ్లు చల్లిన బడ్జెట్ : మాజీ జెడ్పిటిసి
మోపాల్ : ప్రజల ఆశలకు నీళ్లు చల్లిన బడ్జెట్ అని మాజీ జెడ్పిటిసి కమలా నరేష్ అన్నారు. శుక్రవారం మం డల కేంద్రంలో మాజీ జెడ్పిటిసి పత్రిక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారం గానికి నిరాశ మిగిలిందని, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చి బడ్జెట్‌లో కేవలం 7శాతం నిధులు కేటాయించడం సరైనది కాదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యపై ఎంత అవగాహన ఉందో ఈ బడ్జెట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నత విద్యారం గానికి కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవు, కనీసం 15 నుంచి 20శాతం తగ్గకుండా నిధులు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలపైన స్పష్టత కరువైందని ముఖ్యంగా రుణమాఫీకి కావలసిన బడ్జెట్‌లో భారీ కోత విధించిందని తెలిపారు. ముఖ్యంగా దళిత బంధు ఊసే ఎత్తలేదని, యాదవులకి ఇస్తున్న గొర్రెల పెంపకం పథకాన్ని మొత్తానికి మూసేసినట్లు అర్థమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు పారదర్శకంగా లేవని అత్యంత బడుగు, బలహీన వర్గాలకు మేలు చేస్తానని చెప్తూనే వారి గొంతు కోస్తుంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఈ బడ్జెట్‌లో భరోసా లేదు. బడ్జెట్‌లో నిరుద్యోగులకు 4000 భృతి, ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రస్తావించలేదన్నారు. రైతులు మహిళలు, యువత, ఎస్సి, ఎస్టీ, డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు కేటాయించలేదని ఇది అబద్దాల ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు.