Wednesday, May 6, 2026
E-PAPER
Homeక్రైమ్హనుమకొండలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం

హనుమకొండలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం

- Advertisement -

మహిళ మెడలోని పుస్తెలతాడు అపహరణ
నవతెలంగాణ- హనుమకొండ

హనుమకొండ జిల్లా పరిధిలోని బొక్కలగడ్డలో మంగళవారం ఉదయం చైన్‌ స్నాచింగ్‌ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన ఓ మహిళ సిటిజన్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నది. అదే సమయంలో గుర్తుతెలి యని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును(పుస్తెల తాడు) బలవంతంగా లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితుడు వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే హనుమకొండ పోలీసులు, క్రైమ్‌ కంట్రోల్‌ స్టేషన్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, సిటిజన్‌ ఫంక్షన్‌ హాల్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాలను తనిఖీ చేస్తున్నామని, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని హనుమకొండ సీఐ శివకుమార్‌ తెలిపారు. అనంతరం చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడి చిత్రాన్ని విడుదల చేశారు. గ్రీన్‌ కలర్‌ టీ షర్ట్‌, నల్ల ప్యాంట్‌, క్యాప్‌ ధరించిన నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. మహిళలు ఒంటరిగా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -