నవతెలంగాణ ఆర్మూర్: టెస్కో (తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకారం సంఘం లిమిటెడ్ ) ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి సహకార సంఘం నుండి డైరెక్టర్ రేసులో ఆర్మూర్ చైర్మన్ చెన్న రవికుమార్ ముందువరుసలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో చైర్మన్ తో పాటు డైరెక్టర్ ను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కావాల్సి వుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, నిజామాబాద్, భోధన్, పిట్లం, దోమకొండ, బీబీపేట్, కామారెడ్డి సహకార సంఘాలు వున్నాయి.
పరోక్ష పద్ధతిలో టెస్కో చైర్మన్ ఎంపిక…
తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఉన్న ఉమ్మడి జిల్లాలుగా ఉన్న పది జిల్లాలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఉన్ని సహకార సంఘానికి చెందిన మరో డైరెక్టర్ మొత్తం11 డైరెక్టర్లు ఎన్నుకోవాల్సి ఉంది. వీరిలో ఒకరిని పరోక్ష పద్ధతిలో టెస్కో చైర్మన్ ఎంపిక చేయాల్సి వుంది.



