తెలంగాణ ప్రజలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తి

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో వీరోచితంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తినీ తెలంగాణ ప్రజలంతా కొనసాగించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం సోమవారం, సొంత గ్రామంలో బీర్ల ఐలయ్యకు గ్రామ ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రజక సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తనకు పదవి ఉన్నా లేకున్నా సొంత గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. మీ అందరి ఆశీర్వాదం తోటి ఎమ్మెల్యేగా గెలిచాను. పదవికి వన్నె తెచ్చే విధంగా ఆలేరు నియోజకవర్గంను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచి మన గ్రామానికి మంచి పేరు తెస్తానని అన్నారు. కులాలకతీతంగా, మతాలకతీతంగా, పార్టీలకతీతంగా మన గ్రామాన్ని, ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు.  ఇప్పుడున్న రజక భవనం చుట్టూ ప్రహరీ గోడ, బిల్డింగు పైన రూమ్ వేయిస్తానని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరోజుల్లో ఏ కులాలు, మతాలు లేనప్పుడే మన జాతిలో పుట్టిన చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆ రోజుల్లో ఆయుధాలు లేనప్పుడే ఆమెకు ఉన్నటువంటి ఆయుధం కొంగులో కారంపొడి, ఇంకో చేతిలో రోకలిబండ తో విరోచిత పోరాటం చేసిందన్నారు. ఆస్పూర్తితో ప్రజలంతా ముందుండాలి అని అన్నారు. గ్రామ గ్రామాన చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రతిష్టిస్తాను అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సైదాపురం సర్పంచ్ బీర్ల శంకర్, పంచాయతీ సెక్రెటరీ బి రోజా, ఉప సర్పంచ్ దుంబాల సురేఖ వెంకటరెడ్డి, దుంబాల వెంకట్ రెడ్డి, శిఖ ఉపేందర్ గౌడ్, గంధమల్ల కిష్టయ్య, మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజ్, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, సిద్ధులు, జోగిని నర్సింహులు, తోటకూరి మమత మల్లేష్, కన్నాయి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love