గ్రామపాలనే ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే జయవీర్

నవతెలంగాణ-పెద్దవూర : గ్రామపాలనే ద్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో అన్నారు. సోమవారం మండలంలోని బసిరెడ్డి పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాది హామీ పనుల నుంచి రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు.దేశానికి పల్లెలే పట్టుకొమ్మలన్న మహాత్ముడి కలలను సీఎం రేవంత్ రెడ్డి నిజం చేస్తున్నట్లు తెలిపారు.బసిరెడ్డి గ్రామంలో నూతన పంచాయతీ భవననిర్మాణానికి గాను గ్రామానికి చెందిన గోన సోమేశ్వర్ రావు స్థలం విరాళంగా ఇవ్వడం అభినందనీయమని అన్నారు.రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రాజీ లేకుండా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొని ప్రజలు హాయిగా గడుపుతున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో సమస్యలపై  దృష్టి సారించి, గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ నరాల కొండయ్య,జడ్పీ వైస్ చేర్మెన్ ఇరిగి పెద్దులు, ఎంపీపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, జెడ్పిటీసి అబ్బిడి కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపి గోన వివేక్ రావు, ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీఓ విజయకుమారి, మాజి జీప్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డి,మాజీ ఎంపీపి అంతయ్య,కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి,పగడాల నాగరాజు డీఈ రామాంజనేయులు, ఏఈ రామకృష్ణ, సర్పంచులు నడ్డి లింగయ్య, ప్రభావతి సంజీవరెడ్డి, దండ మనోహర్ రెడ్డి, కూన్ రెడ్డి మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి,తుడుం నరేందర్, నరాల ఇంద్ర కిరణ్, రమణ కిషోర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love