బస్టాండ్ సెంటర్ లో చలివేంద్రం ఏర్పాటు

– కమ్మ సంఘం ఆధ్వర్యంలో  చలివేంద్రం
– ఉగాది నాడు చలువ మజ్జిగ పంపిణి
నవతెలంగాణ – అశ్వారావుపేట
కమ్మ సంఘం అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలోని ప్రధాన కూడలి బస్టాండ్ సెంటర్ లో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేసారు. ఇందులో శుద్ది జలంతో కూడిన  కూలింగ్ ఫ్రిజ్ ను సమకూర్చారు‌. ఉగాది పర్వదినం కావడంతో పాదచారులకు,వివిధ పనులు పై పట్టణానికి వచ్చే దాహార్తులు కు చల్లని మజ్జిగను సరఫరా చేసారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సంకురాత్రి సతీష్ మాట్లాడుతూ వడగాల్పులు అధికంగా వీస్తున్న దృష్ట్యా వేసవి తాపం విపరీతంగా పెరగటంతో అనేకమంది పాదచారులు,పట్టణానికి వచ్చే వినియోగదారులు ఉచిత మంచినీళ్లు  దొరకక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.చేసేదేమీ లేక  కూల్ డ్రింక్స్ షాప్ వద్ద బారులు తీరుతున్నారు అని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తూ రోజుకి 200 నుండి 400 లీటర్ల మినరల్ వాటర్ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ అద్యక్షులు అల్లూరి వెంకట రామారావు, ఉపాధ్యక్షులు మార్ని రామారావు,దమ్మపాటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలసిల బాలకృష్ణ,కోశాధికారి ఈధర రాంమోహన్, సభ్యుడు ముళ్ళపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Spread the love