చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి…

నవతెలంగాణ – అమరావతి
టీడీపీ అధినేత చంద్రబాబును ఈరోజు, రేపు సీఐడీ అధికారులు విచారించనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ నిన్న ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు కాన్ఫరెన్స్ హాలును అధికారులు సిద్ధం చేశారు. చంద్రబాబును తొమ్మిది మంది సీఐడీ అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులను కూడా అనుమతిస్తారు. సీఐడీ విచారణ నేపథ్యంలో జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలను పూర్తి చేశారు. కాసేపట్లో చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు విచారణ ప్రారంభమవుతుంది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును విచారించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సీఐడీ అధికారులు బస చేశారు. కాసేపటి క్రితమే వారు గెస్ట్ హౌస్ నుంచి సెంట్రల్ జైలుకు బయల్దేరారు.

Spread the love