మద్దతు ధర పెంచడం పట్ల హర్షం..

నవతెలంగాణ -నవీపేట్: కేంద్ర ప్రభుత్వం వారికి మద్దతు ధర పెంచడం పట్ల బిజెపి ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వారి క్వింటాలుకు 2183 రూపాయలు మద్దతు ధరలను పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతులకు ఎకరానికి 5000 రూపాయల లాభం చేకూరుతుందని అదేవిధంగా 20 : 20 డిఏపి ఫర్టిలైజర్స్ 50 కిలోల బ్యాగుపై 200 రూపాయలను తగ్గించిందని అన్నారు. దీంతో ప్రతి రైతుకు ఎకరానికి పదివేల రూపాయలు అధిక లాభాన్ని పొందవచ్చని అన్నారు. కేంద్రం రైతు అభివృద్ధికి కృషి చేస్తుంటే రాష్ట్రం మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలతో పరిమితమై రైతులను కష్టాల్లో ఊబిలోకి నెట్టుతోందని విమర్శించారు,ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పిల్లీ శ్రీకాంత్, రామకృష్ణ, రాజేందర్ గౌడ్, కాంతం రెడ్డి, బాలగంగాధర్, భూషణ్, బండారి శేఖర్, గంగాధర్, అంకిత మరియు రైతులు పాల్గొన్నారు.

Spread the love