గేద దూడపై చిరుత దాడి..

నవతెలంగాణ – రామారెడ్డి
గేదె దూడపై చిరుత పులి దాడి చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన కొయ్యల రవి గేదె దూడను, బట్టు తండా పరిసర ప్రాంతంలో గల వ్యవసాయ క్షేత్రంలో చిరుత పులి దాడి చేయడంతో దూడ మృతి చెందింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబం కోరింది.
Spread the love