అల్జాపూర్ లో చిరుత సంచారం..

నవతెలంగాణ – నవీపేట్: మండలంలోని యంచ గ్రామపంచాయతీ అల్జాపూర్ గ్రామంలో చిరుత సంచారంపై అటవీశాఖ నార్త్ రేంజ్ అధికారి పద్మారావు, సెక్షన్ అధికారి జహూర్ ఉల్ హక్ సోమవారం పరిశీలించారు. గ్రామంలో చిరుత సంచారంపై గ్రామస్తులు అటవి శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుత పులి పాద ముద్రలను పరిశీలించి గుర్తించారు. పాద ముద్రల ఆధారంగా చిరుత వయస్సు ఎక్కువగా ఉంటుందని పెద్దలు, పిల్లలు రాత్రిపూట ఒంటరిగా బయటికి వెళ్ళవద్దని సూచించారు. వృద్ధ చిరుత కావడంతో పశువులను రాత్రిపూట రక్షించుకోవాలని అతిగా భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఉన్నత అధికారుల ఆదేశాలు అందిన వెంటనే బోన్ ఏర్పాటు చేస్తామని రేంజ్ అధికారి పద్మారావు తెలిపారు. వారి వెంట బీట్ ఆధికారిని సౌమ్య, ప్రవీణ్ కుమార్, నాగు రావు మరియు గ్రామ పెద్దలు ఉన్నారు.
Spread the love