వెలిచాలను ఆదరించి..ఆశీర్వదించండి..

– గుండారంలో వెలిచాలకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం..
నవతెలంగాణ – బెజ్జంకి
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును కుటుంబ సభ్యుడిగా ఆదరించి..ఎంపీగా ఎన్నికవ్వడానికి ప్రజలు ఆశీర్వదించండని మండల కాంగ్రెస్ నాయకులు ఓట్లు అభ్యర్థించారు.శుక్రవారం మండల పరిధిలోని గుండారం గ్రామంలో ఉపాధి హమీ కూలీలకు కాంగ్రెస్ నాయకులు మజ్జిగ పంపిణీ చేసి వెలిచాల రాజేందర్ రావును ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,గుండారం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
యాదవ నాయకులు కాంగ్రెస్ లో చేరిక ..
మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం జిల్లా యువజన నాయకుడు ఇస్కీల్ల సాగర్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,అక్కరవేణి పోచయ్య,తిప్పారపు మల్లేశం,రొడ్డ మల్లేశం,జెల్లా ప్రభాకర్,ఐలేని శ్రీనివాస్ రెడ్డి,నర్సయ్య,ఐలయ్య,రాజు పాల్గొన్నారు.
Spread the love