యాదవుల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ 

– సబ్సిడీ లో గొర్రెల పంపిణీ తో ఉపాధికి ఊతం పారదర్శకంగా గొర్రెల పంపిణీ
– 25 లక్షల రూ. లతో నిజామాబాద్ నగర యాదవ భవనం
– 10 లక్షల తో అర్సపల్లి యాదవ సంఘం నిర్మాణంప్రగతి పథం లో నిజామాబాద్ నగరం
– శాంతి స్థాపన తోనే ప్రగతి సాధ్యం
– సేఫ్ సిటీగా నిజామాబాద్
– నిజామాబాద్ నగరానికి క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు
– మరోసారి దీవించండి.. మరింత అభివృద్ధి చేస్తా…
– యాదవ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే  
నవ తెలంగాణ- కంటేశ్వర్:
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వినాయక మున్నూరుకాపు సంఘం లో యాదవ ఆత్మీయ సమ్మేళనం లో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల  మాట్లాడుతూ.. గొల్ల కురుమలు ఆర్థికంగా వృద్ధి సాధించాలని సబ్సిడీ లో గొర్రెల పంపిణీ కి కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చేసారు. గొల్ల కురుమల సంక్షేమమే లక్షంగా అత్యంగా పారదర్శకంగా గొర్రె పిల్లలు పంపిణీ చేసాము. యాదవుల ఆత్మ గౌరవానికి ప్రతికగా 25 లక్షల రూ. లతో యాదవ భవనం నిర్మిస్తున్నాము. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం లోనే అన్ని కులాల వారు మతాల వారు సంతోషంగా ఉన్నారు. నిజామాబాద్ నగరం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్నాము. చివరి మజిలీ గౌరవంగా జరిగేందుకు అధునిక సదుపాయలతో వైకుంఠదమాలు నిర్మించాము. స్మశాన వాటిక అంటే భయం కలగకుండా పార్కు లాగ వైకుంఠదామాలు నిర్మించాము. సంక్షేమం లో భాగంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం లోకి వచ్చాక విడతల వారీగా ఆసరా పింఛన్లు 5000 రూ. లకు పెంచుతాము. కళ్యాణ లక్ష్మీ-షాదీ ముబారక్ పథకాల ద్వారా అందించే ప్రోత్సాహన్ని 100116/- రూ. ల నుండి 200116/- లకి పెంచుతాము. మనకు పింఛన్లు రావలన్న కళ్యాణ లక్ష్మీ రావాలన్న, అభివృద్ధి కావాలన్నా మరోసారి బీ.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేయండి శ్రీ కృష్ణ భగవాన్ ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ఈ కార్యక్రమం లో నగర మేయర్ దండు నీతూ కిరణ్ గారు, కార్పొరేటర్ లు మల్లేష్ యాదవ్, ఆకుల హేమలత మహిళ నాయకులు మేక లక్ష్మీ యాదవ్, మంజుల యాదవ్, నానీ యాదవ్, యాదవ సంఘం నాయకులు గుర్రం మల్లేష్ యాదవ్, కుంభలా యాదగిరి యాదవ్, రఘు యాదవ్, దేవేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love