తుఫాన్ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పసర పోలీస్ స్టేషన్ సిఐ శంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని పలు లోతట్టు ప్రాంతాల గ్రామాలను ఎస్ ఐ ఎస్ కె మస్తాన్ కలిసి సీఐ శంకర్ పరిశీలించి ప్రజలకు పలు సలహాలు సూచనలు చేశారు. మధ్యాహ్నం నుండి కురుస్తున్న వర్షానికి కి గాను ముందు జాగ్రత్తగా గతం లో వరద ముంపుకు గురి అయిన అభ్యుదయ కాలనీ మరియు ప్రాజెక్ట్ నగర్ ప్రాంతాలను పసర సీఐ శంకర్ మరియు ఎస్సై మస్తాన్ లు సందర్శించడం జరిగింది. గత అనుభవాల దృశ్య వరద తాకిడి పెరుగుతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సందర్బంగా సూచనలు చేయటం జరిగింది.అంతే కాకుండా ప్రజలు అందరూ తుఫాన్ తగ్గేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని చెప్పటం జరిగింది.యువకులు ఎవరు ఈతకు గాని, చేపలు పట్టుటకు గాని వాగుల వద్ద కు గాని, చెరువుల వద్దకు గాని వెళ్లవద్దని, ఎవరైనా ముంపు ప్రాంతాల వారు వరద తాకిడిని బట్టి ఆ ప్రాంతాన్ని కాలి చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ల వలిసి ఉంటుందని చెప్పటం జరిగింది.