- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : స్మోకర్స్‌కు మరో షాక్ తగిలింది. ప్రముఖ సిగరెట్ తయారీ సంస్థలు గాడ్‌ఫ్రే ఫిలిప్స్, ITC Limited పలు బ్రాండ్ల సిగరెట్ ధరలను భారీగా పెంచాయి. మార్ల్‌బోరో ప్యాకెట్ ధర రూ.70 నుంచి రూ.85కు పెరగగా, గోల్డ్ ఫ్లేక్ సూపర్‌స్టార్ ధర రూ.70 నుంచి రూ.79కు చేరింది. ఫిబ్రవరిలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచిన తర్వాత ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. కొత్త పన్ను విధానంతో సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ భారం పెరగడంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. మరోవైపు ఈ పరిణామాలతో షేర్ మార్కెట్‌లో ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
- Advertisement -



