ఆశ కార్యకర్తల అక్రమ అరెస్టులు సరికాదని హనంకొండ జిల్లా సీఐటీయూ కార్యదర్శి, తెలంగాణ ఆశా కార్యకర్తల వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రావుల రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో మహిళా ఆశ ముఖ్య కార్యకర్తలను అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయడం సరి అయింది కాదని ఆయన మండిపడ్డారు. ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వానికి విన్నవించే క్రమంలో వారిపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ప్రతి ఆశా కార్యకర్తకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని సమ్మె సందర్భంగా ప్రభుత్వం న్యాయపరంగా తమ సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తుంటే, ఈ రకంగా అరెస్టులు చేయడం నియంత పాలకు నిదర్శనమని హెచ్చరించారు. ఆశాల న్యాయమైన సమస్యలను అరెస్టులు,నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెబుతూనే ఈ రకంగా మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరైనది కాదని హితవు పలికారు. కార్మికులు తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు,మాట్లాడే హక్కు,సమస్యలపై తమ అసంతృప్తిని తెలిపే హక్కు ప్రతి కార్మికులకు ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.దీన్ని ఈ విధంగా నిర్బంధంతో,నియంతన పోకడలకు పోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది హెచ్చరించారు. అరెస్ట్ అయిన కార్యకర్తలు కవిత, రజిత, రమాదేవి, డైరీ శోభ, ఆశ ముఖ్య కార్యకర్తలు తదితరులు ఉన్నారు.