మున్సిపల్ కార్మికులకు పెండింగులో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి: సీఐటీయూ

నవతెలంగాణ – అచ్చంపేట
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 10 ఏళ్ల పండుగను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అధికారులు అన్ని ప్రణాళికలో సిద్ధం చేశారు. కానీ అచ్చంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఫస్ట్ నుండి పరిస్థితులు ఉన్నాయని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్ మండిపడ్డారు.  తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో అచ్చంపేట మున్సిపాలిటీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఏప్రిల్ మే నెల జీతాలు చెల్లించాలంటూ మున్సిపాలిటీ కార్యాలయం నుండి కార్మికులకు జీతాలు చెల్లించాలంటూ నినాదాలు చేసుకుంటూ అచ్చంపేట ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఆర్డిఓ కార్యాలయంలో ఆర్ ఐ రాములు కు కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రం ఇచ్చారు.  ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మల్లేష్ ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఏ నిర్మల మాట్లాడారు. అచ్చంపేట మున్సిపాలిటీ కార్మికులు పెండింగ్లో ఉన్న రెండు నెలల జీతము చెల్లించాలంటూ అధికారులను విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు.  ఒక్కొక్కరికి రూ.14,000 నుండి రూ.15 వేలు జీతం రావలసి ఉండగా  మున్సిపల్ అధికారుల తప్పిదం వలన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.8000 – 9000,   రూ.10,000 – 11 వేల రూపాయలను వాళ్ల అకౌంట్లో జమ చేసినారు.  కానీ వాస్తవంగా ఈ లెక్కల ప్రకారము ఒక్కొక్క కార్మికుడు రూ.3500 నుండి రూ.4000 రూపాయలకు నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని సరి చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు తెలియజేసిన వాళ్లు ఈ నష్టాన్ని సరి చేయలేదన్నారు.  అందుకే రేపటినుండి మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళుతున్నారు. వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా  30 సంవత్సరాలుగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ను డ్రైవర్ పోస్ట్ తీసేసి పార పని చేయాలంటే ఎలా చేస్తాడని ప్రశ్నించారు.  వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి సమస్యను జటిలం కాకుండా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల జూన్ రెండో తారీకు నుంచి కార్మికులు సమ్మెబాట పట్టడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సాయిలు, శంకర్ , హుస్సేన్,  పాండు , కృష్ణ , మహిళా కార్మికులు కృష్ణమ్మ , బాలమ్మ, అంజమ్మ , చంద్రమ్మ,  వినోద, తదితరులు పాల్గొన్నారు.
Spread the love