దళితులపై వివక్ష పోవడానికి పౌరహక్కుల దినోత్సవం ఉపయోగపడాలి..

– తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రభుత్వం ప్రతి నెల నిర్వహిస్తున్న పౌర హక్కుల దినోత్సవం వంతుకు కాకుండా గ్రామాలలో పౌరులకు ఉన్న హక్కులు సామాజికంగా వివక్షత గురవుతున్న దళితులకు ఉన్న చట్టాలు ప్రజలందరికీ అవగాహన కల్పించి నేటికీ వివిధ రూపాలలో కొనసాగుతున్న కుల వివక్షత రూపుమాపడానికి, దళితులు గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి కావడానికి ఉపయోగపడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెంలో గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మండల తహిశీల్దార్ అధ్యక్షతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ స్థలంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ  కార్యక్రమంలో నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వము ప్రతినెల పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం చాలా శుభ పరిణామమని, ప్రభుత్వ అధికారులు ఎస్సీ వాడలకే పరిమితం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని అన్నారు. వివక్షతకు, దాడులకు, అభివృద్ధికి, విద్యకు, వైద్యంకు, ఉపాధికి దూరం ఉంటున్న దళితుల మధ్యన కార్యక్రమం నిర్వహించడం వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించారు. వివక్షతను గురి చేస్తున్న ప్రజలకు వివక్షతకు గురి చేయవద్దనే అవగాహన కల్పించవలసిన ప్రభుత్వము ఎందుకు పౌర హక్కుల దినోత్సవాన్ని దళితవాడలకే పరిమితం చేస్తున్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్న ఇంకా దళితులు అనేక రకాలైన సామాజిక వివక్షత కొత్త రూపంలో ఎదురుకుంటున్నారని, వాటిపైన అధికారులు ఎందుకు పరిశీలన చేయడం లేదని అన్నారు.
ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరికీ మధ్యన నిర్వహించి ప్రజలకు ఉన్న పౌరులకు చట్టాలను తెలియజేసి వివక్ష రూపాలను రూపుమాపడానికి కృషి చేయాలని సూచించారు. అనాది నుంచి దళితులు వివక్షతతో పాటు అభివృద్ధి, సంక్షేమము, విద్యా, వైద్యం, ఉపాధి, భూమికి దూరంగా ఉంటున్నారని ఇప్పటికైనా ఈ ప్రభుత్వము దళితుల సమగ్ర అభివృద్ధి కోసం తగిన నిధులు కేటాయించి పాటుపడాలని అన్నారు. ప్రతినెల ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు అందరూ పాల్గొనాలని అన్నారు. ఇంకా గ్రామాల్లో ఉన్న వివక్షను రూపుమాపడానికి సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు, దేవాలయ ప్రవేశాలు ప్రజలందరి సమక్షంలో తరచుగా చేపడుతుంటేనే ప్రజలలో మార్పు వస్తుందని, వివక్షత పోతుందని అందుకు జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజా ప్రతినిధులు తగిన బాధ్యత తీసుకొని కృషి చేయాలని అన్నారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులలో రావలసిన నష్టపరిహారం తక్షణం విడుదల చేయాలని, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక సహాయం వెంటనే అందించాలని, గ్రామ గ్రామాన చట్టాల మీద అవగాహన కల్పించడానికి నిరంతర సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ గౌడ్, నాయకులు పల్లెర్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love