ప్రారంభమైన సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష

నవతెలంగాణ-హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌, వరంగల్‌లోని పలు కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులుదీరి కనిపించారు. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా… ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 45,153 మందికి 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్‌లో 4,730 మందికి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేస్తారు. నిరుటి వరకు 10 నిమిషాల ముందు గేట్లు మూసి వేసేవారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు.

Spread the love