కాంగ్రెస్ లో వర్గ పోరు..

– కాంగ్రెస్ నాయకులను గుర్తించకపోవడమే..
– ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కు తగ్గిన ఓట్ల శాతం
 నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో కాంగ్రెస్ వర్గ పోరు భగ్గుమన్నది. ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు రామారెడ్డి మండలంలో అసెంబ్లీ ఎన్నికల కంటే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గడానికి కారణం ఏంట విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే, పార్లమెంటు ఎన్నికల్లో రామారెడ్డి మండలం తో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పగడానికి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వర్కింగ్ ప్రెసిడెంట్ శీల సాగర్ స్పందిస్తూ అపరిచిత వ్యక్తుల సమావేశానికి మాదనన్న సైన్యం వెళ్లకూడదని, మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మా గౌడ్ స్పందిస్తూ ఎలాంటి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు లేవని, ఎవరైనా పార్టీ కి విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మండలంలో రాజకీయం వేడెక్కింది. మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను, కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేకనే ఎల్లారెడ్డి నియోజకవర్గం లో కాంగ్రెస్కు ఓటింగ్ శాతం తగ్గిందని, కష్టపడి ప్రతిపక్షంలో ధర్నాలు ర్యాలీలు, కేసులైన భయపడకుండా పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కొట్లాడితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్టీ లోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారని, ప్రతిపక్షాలు మండలంలో ఆరోపణలు చేస్తే, వారికి కౌంటర్ ఇవ్వవలసిన నాయకులు, అది మానుకొని సొంత పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎవరు భయపడవద్దని, ఎవరికి ఆపద వచ్చినా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి, అంబాయి ప్రసాద్, నామాల రవి, వడ్ల లక్ష్మీరాజం, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతకుంట కిషన్, నర్సింగరావు, బి పేట నర్సింలు, అనీఫ్, ఎల్లయ్య,పోతుల భాస్కర్ రెడ్డి,పరుశురాం,ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love