కొనుగోలు పూర్తయినందున.. కేంద్రాల మూసివేత

– సింగిల్ విండో ఛైర్మన్ సామాబాపు రెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కొనసముందర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు  పూర్తయినందున కేంద్రాలను శుక్రవారంతో మూసివేస్తున్నట్లు సింగిల్ విండో చైర్మన్ సామాబాపు రెడ్డి తెలిపారు. విండో పరిధిలోని  కొనుగోలు కేంద్రాలైన కొనసముందర్, నర్సాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి పూర్తి ధాన్యం సేకరించినందున కొనుగోలు కేంద్రాలను మూసేస్తున్నట్లు వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోలుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా సహకార అధికారికి, డిఎస్ఓ, మండల తహసిల్దార్, సంఘ డైరెక్టర్లకు, సంఘ సిబ్బందికి విండో పరిధిలోని గ్రామాల రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Spread the love