సాహస బాలుడిని అభినందించిన సీఎం రేవంత్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అగ్ని ప్రమాదంలో ఆరుగురిని కాపాడిన 15 ఏండ్ల బాలుడు సాయిచరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి సాయిచరణ్‌ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌ తీసుకొచ్చారు. ఈనెల 26న హైదరాబాద్‌ శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆ బాలుడు ఆరుగురిని కాపాడారని సీఎం గుర్తు చేశారు. ఇటీవలే బాలుడు పదో తరగతి పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రానికి చెందిన సాయిచరణ్‌ సాహసాన్ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

Spread the love