రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు రేషన్‌ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతాం. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయి. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పాం. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడని అధికారులను ఆదేశాలు ఇచ్చాం. మండలాలు రెవెన్యూ డివిజన్‌ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్‌ ఏర్పాటు చేస్తాం. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తాం. చర్చల తర్వాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్తాం’’ అన్నారు.

Spread the love