
రాష్ట్రవ్యాప్తంగా లక్ష వరకు ఉన్న రైతు పంట రుణాలను మాఫీ చేసిన సందర్భంగా భువనగిరి మండలంలో అనాజిపురం రైతు వేదిక కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బానసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, భువనగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం శివానంద్, తోటకూర వెంకటేష్ యాదవ్, అల్లంల జంగయ్య, బాబురావు పిట్టల రజిత, సుక్క స్వామి, మైలారం వెంకటేశం గొల్లపల్లి అశోక్, సతీష్ పవన్, పచ్చ పాండు లు పాల్గొన్నారు.