సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా..

నవతెలంగాణ – హైదనాబాద్: సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. ఈరోజు(శుక్రవారం) కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరగనున్న పర్యటన యథావిథిగా రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  కాగా, పీసీసీ చీఫ్, క్యాబినెట్‌ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, తదితర విషయాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక తన పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసిందని అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తానని, అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

Spread the love