నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన లబ్దిదారుడు రేగుల శంకర్ కు ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైనా చెక్కును గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న శంకర్ ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం రేగుల శంకర్ కు రూ.17వేల 500 చెక్కును మంజూరు చేసింది. అట్టి చెక్కును లబ్ధిదారునికి సర్పంచ్ సైలేందర్ చేతులమీదుగా అందజేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకి కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబెర్ బాస వేణుగోపాల్ యాదవ్ కు లబ్ధిదారుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తక్కరి ముత్యం, వార్డ్ సభ్యులు దాసరి రాకేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఎనేడ్ల గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, న్యాయవాది సుంకరి విజయ్, డాక్టర్ నరేష్, సాధుల్లా, దినేష్, నజీర్, ఉబేద్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.



