Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహసిల్దార్ ను సత్కరించిన సర్పంచ్

తహసిల్దార్ ను సత్కరించిన సర్పంచ్

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
కమ్మర్ పల్లి మండల నూతన తహసిల్దార్ నరేష్ ఉప్లూర్ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల బదిలీపై తహసిల్దార్ గా విచ్చేసిన నరేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులకు, సంక్షేమ పథకాలకు  దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సత్వరం సర్టిఫికెట్ లు మంజూరు చేయాలని తహసీల్దార్ నరేష్ ను సర్పంచ్ శైలేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు, అడ్వకేట్ సుంకరి విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నజీర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -