
ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం ఎం.ఎల్.సి ఎన్నికలపై జిల్లా అధికారులతో ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకతో కలసి వెబెక్స్ నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న ఎన్నిక ఉన్నందున జిల్లాలోని ప్రతి డివిజన్ లో ఎక్కడ కూడా ఎం.సి.సి వైలేషన్ కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని , ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని సమకూర్చాలని సూచించారు. ఎఫ్.ఎస్.టి బృందలు నిఘా పెంచాలని, అదేవిదంగా 71 పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు పరిశీలన చేయాలని సూచించారు. ఎం.ఎల్.సి ఎన్నికల నిర్వహణపై 16న గురువారం ఏర్పాటు చేసే సమావేశానికి నోడల్ అధికారులు హాజరు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సి.ఈ. ఓ అప్పారావు, ఆర్.డి.ఓలు సూర్యాపేట వేణుమాధవ్, హుజూర్ నగర్ శ్రీనివాస్, కోదాడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.