
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అంధులు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మెదటి అంతస్తు లోని (f11) కాన్ఫరెన్స్ హాల్ లో ఓటు వినియోగం పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 తేదిన జరిగే ఓటింగ్ సందర్భంగా అంధులకు జిల్లా వ్యాప్తంగా ఓటును వినియోగించుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అన్నారు. అన్ని ప్రాంతాల్లో వీల్ చైర్స్, ర్యాంప్స్ సౌకర్యాలు అలాగే అంధులకు బ్రెయిలీ లిపిలో ఓటును బ్యాలెట్ పేపర్ తో ఉపయెగించుకునేలా ప్రతి పోలింగ్ కేంద్రం లో బ్రెయిలీ లిపి లో బ్యాలేట్ పేపర్ అలాగే ఈ వి ఎం మిషన్ పై కూడా బ్రెయిలీ లిపి ఏర్పాటు చేయటం జరిగిదని అన్నారు.జిల్లాలో అంధులు, దివ్యాంగులు అందరు తమ యొక్క ఓటు హక్కును నూరు శాతం వినియోగించుకోవాలని సూచించారు.జిల్లాలో అంధులు 2193 మంది ఉన్నారని ప్రతి ఒక్కరు ఓటు హక్కు కల్పించేలా అన్ని కేంద్రాల్లో సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దివ్యాంగులు 96.51 శాతం, ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలో 98.21 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. స్వీప్ కార్యాచరణలో భాగంగా అంధులు వికలాంగులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.దివ్యాంగులకి ప్రభుత్వం ఉచిత రవాణా, వికలాంగులకి (అంధులకి) పోలింగ్ బూత్ వద్ద వీరికి సహాయపడేలా వాలంటీర్లు నియమించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారిణి వి. వెంకట రమణ, బ్రెయిలీ లిపి ట్రైనర్ శ్రీనివాస్ , సీడీపీఓ లు , కిరణ్మయి, శ్రీవాణి, సాయిగీత,పారిజాత,రూప,హేమ , అంధుల సంక్షేమ ప్రెసిడెంట్స్ వెంకటయ్య, ఉపేంద్ర జిల్లాలోని అంధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.