– పురపాలక శాఖ ఆదేశాలు బేఖాతర్
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రభుత్వ సంస్థల కార్యాలయాలలో మహిళ ఉద్యోగులు అసాంఘిక లైంగిక వేధింపులకు కట్టడి చేయాలనే ప్రధాన లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా పురపాలిక శాఖలో మహిళల వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ రాష్ట్ర అధికారులు ఏప్రిల్ 29న ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించడానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ప్రిసైడింగ్ అధికారిగా మహిళ ఉద్యోగిని నియమించాలి. సామాజిక సేవ కార్యక్రమాలను పర్యంలో తీసుకున్న వ్యక్తులను సభ్యులుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మహిళ ఉద్యోగి లేకపోతే ఇతర శాఖల నుండి తప్పనిసరి పరిస్థితుల్లో మహిళల ఉద్యోగిని తీసుకోవలని సూచించారు. లేని పక్షంలో పురపాలక శాఖలో లైంగిక వేధింపులను కట్టడి చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన నిర్మాణాలు తీసుకోవడం ఆశించదగ్గ విషయమని పురపాలక శాఖలో పనిచేస్తున్న. ఉద్యోగులు ద్వారా తెలిసింది. ప్రభుత్వ సంస్థల నుంచి రావలసిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు చేసుకోవలసిన అవసరం ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్ మున్సిపల్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో రెండు లక్షల 47 వేల పైగా ఓటర్లు ఉన్నాయి. ప్రభుత్వ రంగ స్థలంలో పురుషులతో పాటు మహిళలు పొటాపుటిగా పనులు చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో కొందరు పురుష అహంకారంతో జీర్ణించుకోలేక వ్యక్తిగత దారులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న అంతర్గత కమిటీలు మహిళా వేధింపులకు పూర్తిగా కట్టడి చేయాలని పురపాల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉంటే ఎక్కడ కూడా మహిళా వేధింపుల అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయలేదని తెలిసింది. ఎంతో ప్రార్ధన తగల అంతర్గత కమిటీలు రూపాలు కల్పన చేయడంలో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది.