నవతెలంగాణ – నాచారం
నాచారం సర్కిల్ ఎర్రగుంట లోని హిందూ స్మశాన వాటికలో పెరిగిన పిచ్చి చెట్లు, కంపచెట్లు, ఎండి పోయిన కొమ్మలు, చెత్త మట్టి కుప్పల కారణంగా అశుభ్ర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ సహకారంతో స్మశాన వాటికను పూర్తిగా శుభ్రపరిచినట్లు స్మశాన వాటిక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి, స్మశాన వాటికను వైకుంఠధామంగా అభివృద్ధి చేయడానికి మంజూరైన రూ.3 కోట్ల నిధులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
అలాగే మిగిలిన చెత్త తొలగింపునకు మున్సిపల్ అధికారులతో కలిసి రెండు రోజులపాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానందంకు ఫోన్ చేసి, స్మశాన వాటికలో శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో శ్రీమూర్తి నాగరాజ్, కొమ్మగల ప్రవీణ్, చిలుక శంకర్, జంగం నర్సింగ్, జంగం రాములు, బందెల మనోజ్, బి. బాలరాజ్, జంగా శ్రీధర్, ఎం. శ్రవణ్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



