Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జెఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

జెఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా, ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జటంగి లింగమూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం గ్రామంలోని ఐకెపి కేంద్రం వద్ద స్వర్గీయ బండి అంతయ్య జ్ఞాపకార్ధంగా జెఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ మేరకు తీవ్రమైన ఎండల నేపథ్యంలో ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు, హమాలీలకు చల్లటి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేర్ల మన్మధ, పేర్ల శ్రీను, ప్రభాకర్, కాసర్ల గణేష్, జటంగి శ్రీనివాస్, మంగళపల్లి నాగరాజు, ఉప్పుల నవీన్, బయ్య లింగయ్య, బొబ్బలి శీను, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -