మానవీయకోణంలో కారుణ్య నియామకాలు..

మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ శాఖ పరిధిలోని గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో 30 మందికి కారుణ్య నియామక పత్రా లను అందజేశామని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలి పారు. శుక్రవారం హైదరాబాద్‌ లోని దామోదర సంజీవయ్య సంక్షే మ (డీఎస్‌ఎస్‌) భవన్‌లో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు జీసీ సంస్థ పురోభివృద్ధి కి తోడ్పాడాలని కోరారు. సంస్థను నమ్ముకుని విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారని చెప్పారు. ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ కారుణ్య నియామకాల ఉత్తర్వుల ను అందజేయటం సర్కారు ఆలో చనకు అద్దం పడుతున్నదన్నారు. జీసీసీని నమ్ముకుని అనేక కుటుం బాలు బతుకుతున్నాయని చెప్పా రు. కరోనా విపత్కర పరిస్థి తుల్లో సైతం సంస్థ ఆధ్వర్యంలో శానిటై జర్‌ ఉత్పత్తి చేసి.. అధిక సంఖ్యలో పంపిణీ చేశామని గుర్తు చేశారు. అటవీ ఉత్పత్తులకు మరింత బ్రాం డ్‌ను పెంపొందిస్తూ, సంస్థ అభి వృద్ధికి తోడ్పడాలని ఉద్యోగులకు సూచించారు. ప్రభు త్వం ప్రజల ప్రయోజనాల కోసం చేపడుతున్న పలు పథకాలను ప్రజల దరి చేర్చా ల్సిన బాధ్యత ఉద్యోగులదేనని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీల అభివృద్ధికి ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్య క్రమంలో జీసీసీ చైర్మెన్‌ వాల్యా నాయక్‌,గిరిజన సంక్షేమశాఖ కార్య దర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకు లు సర్వేశ్వర్‌రెడ్డి, జీసీసీ జీఎం సీతారాం నాయక్‌, చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌ రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love