ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు సూచనలపై అబ్జర్వర్ ను సంప్రదించాలి

– జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే
నవతెలంగాణ – భువనగిరి
ఎన్నికలకు సంబంధించిన సూచనలు, ఫిర్యాదులకై జనరల్ అబ్జర్వర్ ను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నేడొక ప్రకటనలో తెలిపారు.14- భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గం సంబంధించి మణిపూర్ క్యాడర్ చెందిన రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్ ఐఏఎస్., (2010 బ్యాచ్) జనరల్ అబ్జర్వర్ గా నియమించబడి ఈనెల 24 తేదీన రావడం జరిగిందని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ పరిథిలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగాం, ఇబ్రహింపట్నం అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి ఓటర్లు, ఆయా పార్టీలు, అభ్యర్ధులు పార్లమెంట్ నియోజక వర్గ పరిథిలోని ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సూచనలు, ఫిర్యాదులు చేయదలచిన వారు ఎన్నికల జనరల్ అబ్జర్వర్  సెల్ ఫోన్ నెంబరు 9963469221 ద్వారా సంప్రదించవచ్చునని, యాదాద్రి భువనగిరి కలెక్టరు కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లోని స్టేట్ ఛాంబర్ లో ప్రతి రోజూ సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల మధ్య వారిని కలిసి ఫిర్యాదులు, సూచనలు అందచేయవచ్చునని తెలిపారు. జనరల్ అబ్జర్వర్ కు లైజనింగ్ అధికారిగా జిల్లా మత్స్యశాఖ అధికారి పి.రాజారామ్ సెల్ ఫోన్ నెంబరు 9000368915 వ్యవహరిస్తారని తెలిపారు.
Spread the love