జి-7 శిఖరాగ్ర సదస్సుకు ఇటలీ ఆహ్వానం

నవతెలంగాణ న్యూఢిల్లీ: జూన్‌ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. గురువారం ఆమెతో మాట్లాడిన మోడీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. జి-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడంపైనా చర్చించినట్టు ఆయన ‘ఎక్స్‌’లో తెలిపారు. జూన్‌ 4న వెల్లడి కాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోడీ గెలుపుపై విదేశాలూ నమ్మకంతో ఉన్నాయన్న విషయాన్ని తాజా ఆహ్వానం చాటుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Spread the love