న్యూఢిల్లీ : అంత్యోదయ అన్నయోజన కేటాయింపులను హేతుబద్ధీకరించాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రతా చట్టం – 2023 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కు సవరణలు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ప్రకారం… అంత్యోదయ అన్నయోజన (ఏఏవై) లబ్దిదారులకు ప్రస్తుతం నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలను (కుటుంబ సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా) అందజేస్తున్నారు. ఇప్పుడు దానిని మార్చి ఒక్కో కుటుంబ సభ్యునికి ఏడు కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ గరిష్టంగా 35 కిలోల మాత్రమే ఇవ్వనున్నారు. ఏఏవై కార్డులు ఉన్న వారందరికీ ఇప్పుడు ఇస్తున్నట్లుగానే ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తారు. ముసాయిదాపై జూలై 13వ తేదీ వరకూ ప్రజలు తన అభిప్రాయాలు తెలియజేయవచ్చునని కేంద్ర ఆహార-ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనపై బీజేపీ పాలిత రాష్ట్రాల లబ్దిదారులు, ఆహార హక్కు కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఒక్కో కుటుంబ సభ్యుడికి 14కిలోల ఆహార ధాన్యాలను అందించాలని, పప్పు ధాన్యాలు, వంట నూనెలను కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం ఆహార ధాన్యాల కేటాయింపులో ‘ఉత్తర-దక్షిణ విభజన’ను సృష్టిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కో కుటుంబ సభ్యునికి ఏడు కిలోల ఆహార ధాన్యాలు అందించాలని అనుకున్నప్పుడు గరిష్ట పరిమితిని తొలగించాలని పలువురు కోరుతున్నారు. ఉదాహరణకు ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా 35 కిలోల ఆహార ధాన్యాలను ఇస్తే ఒక్కొక్కరికీ సగటును ఆరు కిలోలు కూడా రావు. ఏఏఐ కుటుంబాల అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలు ఇవ్వడంతో పాటు స్థూల పోషకాల ప్యాకేజీని కూడా అందించాలని ఆహార హక్కుపై ప్రచారం చేస్తున్న ఓ సంస్థ ప్రతినిధి అనురాధ తల్వార్ కోరారు.
హేతుబద్ధీకరణ పేరుతో అంత్యోదయ అన్నయోజన కేటాయింపుల కుదింపు
- Advertisement -
- Advertisement -



