మల్హర్ లో  ప్రజాపాలన  దరఖాస్తుల కంప్యూటీకరణ పూర్తి..

– ఇంటింటా సర్వేకు సిద్ధం
నవతెలంగాణ- మల్హర్ రావు
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండలంలో ఆరు గ్యారంటీలకు దరఖాస్తుల కంప్యూటికరణ వందశాతం పూర్తియినట్లుగా తెలుస్తోంది. మండలంలోని 15 గ్రామాల నుంచి 9,357 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం వరకు వందశాతం కంప్యూటికరణ పూర్తి అయినట్లుగా ఎంపిడిఓ నరసింహమూర్తి తెలిపారు. ఆయుతే ఎక్కువ భూ సమస్యలు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలను అంధించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.కాగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తీయింది. తరువాత డేటా ఎంట్రీ ప్రక్రియ తుది గడువు కంటే ముందుగానే పూర్తియింది.మండలంలో ప్రయివేటు, ప్రభుత్వ ఆపరేటర్లు 30 మంది పని చేసి త్వరిగతిన  డేటా ఎంట్రీ పూర్తి చేసినట్లుగా.. త్వరలో ఇంటింటా సర్వేకు సిద్దమవుతున్నట్లుగా తెలిపారు.
Spread the love