మృతుని కుటుంబానికి పరామర్శ 

Condolences to the family of the deceased– బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించినట్లు బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పరిపాటి వెంకట్ రెడ్డి తెలిపాడు. మండలంలోని నల్లగుట్ట తండ గ్రామపంచాయతీకి చెందిన దేశిలాల్ మృతి చెందడంతో ఆయన పార్థవదేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతిని తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశిలాల్ మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆయన ఈ తండాకి తండా అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తారని అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామగిరి పీఏసీఎస్ వైస్ చైర్మన్ భోజ్య నాయక్. హనుమ నాయక్, మల్సురు వెంకన్న, భీముడు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love