- Advertisement -
నవతెలంగాణ-కట్టంగూర్
జలసంచాయి జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా మండలంలోని కట్టంగూరు కలిమెరా గ్రామాలలో శనివారం వేముల పుష్ప కళాజాత బృందం నీటి సంరక్షణ పై ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. మూడు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కళాజాత ద్వారా నీటి వినియోగం, సంరక్షణ,పొదుపు పై కళాజాత రథం ద్వారా పర్యటించి నీటిని సంరక్షించడం వల్ల జరిగే ప్రయోజనాలను వారికి అర్థమయ్యే విధంగా వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు ముక్కాముల శ్యామల శేఖర్, తోటకూరి జలజయాదయ్య, కొలిపాక సురేందర్, డిపిఎం మోహన్ రెడ్డి, ఏపీవో రామ్మోహన్, కళాజాత బృందం సభ్యులు లతీఫ్,నిర్మల, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -



