జాతీయ రహదారి భూసేకరణపై సమావేశం

నవతెలంగాణ – ముత్తారం
జాతీయ రహాదారి నెంబర్‌ 163జి నిర్మాణం కోసం చేపట్టే భూ సేకరణలో భాగంగా ముత్తారం మండలం లక్కారం గ్రామంలో మంథని ఆర్డీఓ వి.హనుమ నాయక్‌ శనివారం సమావేశాన్ని నిర్వహించారు. లాక్కారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో, లక్కారం గ్రామంలో భూసేకరణ సంబందించి విచారణ నిర్వహించారు. ఈ సమావేశంలో భూమికి నష్టపరిహారం ఆర్‌ఎఫ్‌సిటి ఎఆర్‌ఆర్‌ 2013 చట్ట ప్రకారం చెల్లించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. సమావేశంలో రైతులు అడిగిన ప్రశ్నలకు ఆర్డీఓ నివృత్తి చేశారు. కార్యక్రమములో స్పెషల్‌ ఆఫీసర్‌ వరలక్ష్మి, తహశీల్దార్‌ రాజేశ్వరీ, మాజీ సర్పంచ్‌ లలిత చంద్రమౌళి, ఎంపిటిసి తిరుమల తిరుపతి, ఆర్‌ఐ శ్రీధర్‌, భూ నిర్వాసితులు, ప్రజలు పాల్గన్నారు.
Spread the love