– ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
నవతెలంగాణ – వేములవాడ
రైతులను రాజుగా చెయ్యడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై, టెస్క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతును రాజులుగా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం గా పనిచేస్తుందని ఆయన తెలిపారు. రైతులకు సహకార సంఘాల ద్వారా లబ్ది చేకూర్చడానికి వాణిజ్య బ్యాంకులతో సమానంగా సహకార సంఘాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి ఆయన వెల్లడించారు. సహకార బ్యాంకుల ద్వారా గ్రామాల్లో ఉపాధి మార్గాలను ముందుకు తీసుకపోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు. బ్యాంక్ చైర్మన్ లు అంకిత భావంతో పనిచేయడం వల్లే సహకార బ్యాంక్ లు ఈ స్థాయికి ఎదిగాయి అని అభినందించారు. వాణిజ్య బ్యాంక్ లతో ధీటుగా పోటీ పడి సహకార బ్యాంక్ లు ముందుకు వస్తున్నాయి. రైతులకు స్వల్పకాలిక ,దీర్ఘకాలిక రుణాలు ఇస్తూ బాసటగా ఉంటున్నారు. ముంపు గ్రామాల్లో ఉపాధి మార్గాలకు ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది,ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి అధికారులతో పలు సమావేశలు ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. గతంలో ముంపు గ్రామాల్లో బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. త్వరలోనే వాటికి పరిష్కారం లభిస్తుంది అని ఆశ భావం వ్యక్తం చేశారు. రైతులు సహకార బ్యాంకులను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, బ్యాంకు సిబ్బంది, రైతులు, గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.