ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… మండల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, నిధులు కేటాయించాలని కోరగా, సానుకూలంగా స్పందించినట్లు మోహన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జుక్కల్ మాజీ జెడ్పిటిసి సాయి ప్రదీప్, బట్టు తాండ మాజీ సర్పంచ్ రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.