
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమింపబడ్డ నాగరిగారి ప్రీతం ని హైదరాబాదులోని భువనగిరికి చెందిన యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందజేసి, ఎస్సీల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షులు కనుకుంట్ల కొండల్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చేగూరి బాలు, మండల కార్యదర్శి లకావత్ సురేష్, నాయకులు కొండమడుగు శ్రీనివాస్, బోల్లేపల్లి తుకారం, బోయ శివ లు పాల్గొన్నారు.