ఉపాధి హామీ పనుల వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రచారం

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ ఇవ్వడం ల వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు. అదేవిధంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పోచారం గ్రామ అధ్యక్షుడు వేముల కిరణ్, లచ్చిరెడ్డి ,నాగిరెడ్డి, సంగమేశ్వర్ తోపాటు కోఆప్షన్ సభ్యుడు షాహిద్ పాషా, శేఖర్, ఇమామ్, విక్రమ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love