జుక్కల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్కు 1745 ఓట్లు  మెజారిటీ

– సొంత నియోజకవర్గంలోనే బిబి పాటిల్ కు మెజారిటీ ఇవ్వని ఓటర్లు
నవతెలంగాణ-మద్నూర్
జహీరాబాద్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన బిబి పాటిల్ సొంత నియోజకవర్గం జుక్కల్ కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో మొత్తం 255 పోలింగ్ బూతులు ఉండగా వీటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్య1,53,855 జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ముఖ్యమైన పార్టీ అభ్యర్థులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా బిబి పాటిల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షట్కార్ పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగినట్లు ప్రజల చర్చలను బట్టి తెలిసింది. కానీ జహీరాబాద్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు బీజేపీ అభ్యర్థి బిబి పాటిల్ కంటే 1 745 ఓట్లు అధికంగా వచ్చినట్లు జుక్కల్ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేసిన నివేదికలను బట్టి తెలిసింది. జుక్కల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు సొంత నియోజకవర్గం కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో సొంత నియోజకవర్గం నుండి పోటీచేసిన బీబీ పాటిల్ అభ్యర్థిత్వానికి ప్రజలు ఆశాజనకంగా ఓట్లను మెజారిటీ ఇవ్వలేకపోయారు. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్ల సంఖ్య1,53,855 కాగా మూడు పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్య ఈ విధంగా ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ కు 20747 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు 61832 ఓట్లు పడగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు 63577 ఓట్లు పడ్డాయి. ఈ విధంగా పడ్డ ఓట్లను పోలిస్తే బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ఒక వెయ్యి 745 ఓట్లు ఆదిక్యత సాధించారు. ఈ విధంగా జుక్కల్ నియోజకవర్గ ఓటర్లు సొంత అభ్యర్థిని అని లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యత అందించడం విశేషం.
Spread the love