అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు..

– కాంగ్రెస్ పార్టీకి  కైవసం కానున్న మున్సిపల్ ఛైర్మన్ పీఠం
నవతెలంగాణ – అచ్చంపేట 
అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు త్వరలో కాంగ్రెస్ పార్టీకి కైవసంకానున్న మున్సిపల్ చైర్మన్ పీఠం. ఎమ్మెల్యే తో పాటు 16 మంది కౌన్సిలర్ల ఓటుకు ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పట్టణంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అచ్చంపేట పురపాలక సంఘం బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి   అనుకూలంగా ఓట్లు పడ్డాయని పురపాలిక పోస్టింగ్ అధికారిని, అచ్చంపేట ఆర్డిఓ కే.  మాధవి తెలిపారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బుధవారం నాడు ఉదయం 11 గంటలకు అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో  మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ ఒంటెద్దు పోకడ, ఏకపక్ష నిర్ణయాలపై  నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో 16 మంది కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అవిశ్వాసానికి ఓటు వేశారని తెలిపారు.  అచ్చంపేట పురపాలక సంఘంలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా 16 మంది అవిశ్వాసానికి ఓటు వేశారని తెలిపారు.  నలుగురు కౌన్సిలర్లు మాత్రం అవిశ్వాసానికి ఓటు వేసేందుకు దూరంగా ఉన్నారని తెలిపారు. అవిశ్వాసపు ఫలితాలను కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుందని తదుపరి ఉత్తర్వుల మేరకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్డిఓ మాధవి తెలిపారు. తదుపరి జరగనున్న చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గార్లపాటి శ్రీనివాసులు కు చైర్మన్ పదవి వరిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Spread the love