50వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం..

నవతెలంగాణ- ఆర్మూర్ 
 నియోజకవర్గ బీఅర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చాలా వేదింపులకు గురి చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి వినయ్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పట్టణం లో శుక్రవారం పెర్కిట్ చౌరస్తా నుంచి, అంబేద్కర్ చౌరస్తా వరకు వినయ్ రెడ్డి బారీ ర్యాలీ చేపట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బారీ ర్యాలీలో పాల్గొన్న భారీగా మహిళలు యువకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు.ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన స్వంత ఇల్లుని ఖాళీ చెయించడని వినయ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు జీవన్ రెడ్డి, తను ఒకటే అని ప్రచారం చేస్తున్నారని ప్రజలు పుకార్లను నమ్మొదని అన్నారు. తనను మోసం చేసిన జీవన్ రెడ్డి నీ ఎప్పటికీ వదలనని, జీవన్ రెడ్డి కి 38 కోట్లకు అమ్ముడుపోయానని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్న నాయకులకు సవాల్ విసిరారు. నవసిద్దుల గుట్ట పై పచ్చి బట్టలతో వెళ్దామని సవాలు విసిరారు. అన్నట్లుగానే నామినేషన్ అనంతరం సిద్దుల గుట్ట పచ్చిబట్టలతో ఎక్కి శివాలయం లోని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాను డబ్బులకు అమ్ముడు పోలేదని, జీవన్ రెడ్డి నేను ఒకటి కాదని నిరూపించుకున్నాడు.ఆర్మూర్ లో ఎమెళ్యే జీవన్ రెడ్డి వ్యతిరేకంగా తిరిగితే కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.
Spread the love