బీఅర్ఎస్ తోనే నియోజకవర్గం అభివృద్ధి.. నోముల భగత్

నవతెలంగాణ -పెద్దవూర : బీఅర్ఎస్ తోనే గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తానయని బీఅర్ఎస్ ఎంఏల్ ఏ అభ్యర్థి నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం పెద్దవూర మండలంలోని తుంగతుర్తి, రామన్నగూడెం, రామన్నగూడెంతండా, పొట్టేవాని తండా, నాయినావాని గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నోములు భగత్ కు మంగళ హారతులతో, డప్పు చప్పుళ్లతో  కోలాటాలతో స్వాగతం పలికారు. ఈసందర్బంగా మాట్లాడారు.2014 లో గెలిచి జానారెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ కే పరిమితం అయ్యారనీ, నేను గెలిచినప్పటినుంచి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో వుంటున్నాని అన్నారు. జానారెడ్డికి నియోజకవర్గం అభివృద్ధ గురించి ఏనాడు పట్టించుకోలేదని వీక్విమర్శించారు. బీఅర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటికి ఓటు అడగడానికి వస్తే వారిని నిలదీయాలినీ తెలిపారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జి రామచంద్రనాయక్, జడ్పీటీసి అబ్బిడి కృష్ణారెడ్డి, చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, కర్ణ బ్రహ్మ రెడ్డి, జటవత్ రవి నాయక్, కూరాకుల అంతయ్య, గజ్జల లింగారెడ్డి, హాలియా మార్కెట్ వైస్ చైర్మన్ ఆడెపు రామలింగయ్య, రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడు భషీర్, మండల ప్రధాన కార్యదర్శి ముని రెడ్డి, అబ్బాస్, స్థానిక సర్పంచ్ మెండే విష్ణుప్రియ, యూత్ అధ్యక్షుడు మెండే సైదులు, సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ లు పొదిలా శ్రీనివాస్, రాజేష్ , కిషన్ నాయక్, రవి నాయక్, బంజారా సంఘం అధ్యక్షుడు శివాజీ నాయక్, తరి పెద్దులు, మండల మహిళా అధ్యక్షురాలు మాధవి-బాలకృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love