బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగానికి ప్రమాదం

– రాజ్యాంగ రక్షణ కోసం పోరాడే పరిస్థితి
జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ,
– అంబేద్కర్ విగ్రహానికి వినతి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని హుస్నాబాద్ తెలంగాణ జేఏసీ నాయకులు ఆరోపించారు. మంగళవారం హుస్నాబాద్ లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీ పై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ విధానాలను దేశంలో అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మత ప్రాతిపదికన రాజరికపాలన కొనసాగించుటకు మతాన్ని ముందుకు తీసుకు వస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ , జేఏసీ నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి, బంక చందు, సారయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love