– వరంగల్ సిసిఏప్ కన్సర్వేటర్ ఆర్ఎం దొబ్రిల్
నవ తెలంగాణ మల్హర్ రావు.
అడవుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు పాటుపడాలని తెలంగాణ అటవీశాఖ వరంగల్ సిసిఏప్ ఆర్ఎం దొబ్రీల్ అన్నారు.గురువారం కొయ్యుర్ అటవీశాఖ రేంజ్ పరిధిలో జంగిడిపల్లి బిట్ పరిధిలోని బొగ్గులవాగు అటవీప్రాంతంలో రూ.10 లక్షలతో నిర్మాణం చేపట్టిన క్లాక్ టవర్ ను అటవీశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. టవర్ నిర్మాణంతో భూపాలపల్లి, కొయ్యుర్, రుద్రారం, జంగిడిపల్లి బిట్ పరిధిలోని అడవుల రక్షణకు కవచంలా పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సిపి వినోద్ కుమార్ కాళేశ్వరం జోన్ సీసీఏప్,భూపాలపల్లి డిఏప్ఓ జె.వసంత, భూపాలపల్లి ఏప్డిఓ కృష్ణ ప్రసాద్, కొయ్యుర్ రేంజర్ కిరణ్ కుమార్,సెక్షన్, బిట్ అధికారులు పాల్గొన్నారు.